Ohne Titel
ClassicalRelaxingFemale VocalsMotivationalSadViolinSlowSteadyMedium
Erstellt von: TextSongAI
Erstellt am: 21.05.2026
Dauer: 4:16
వస్తా ఉత్తదీ పోతా ఉత్తదీ
ప్రయాస యెందేకో ఓ జీవా!
మేలు చేసినా కీడు చేసినా పునర్జన్మ తప్పదే ఓ జీవా!
పంచభూతములు సప్త ధాతువులు
యింతే దేహము ఓ జీవా!
ఉండీ పుట్టీ పెరిగీ మారి కృశించి పోవునే ఓ జీవా!
పంచ ప్రాణములు ఉపవాయువులు
యింతే ప్రాణము ఓ జీవా!
ఆ ప్రాణము లెగిరి పోయిన, నీవెవరవె ఓ జీవా!
పంచకోశములు శరీర త్రయము
నీవు కాదు కదా ఓ జీవా!
ఇవి నిజమేనని భ్రమసి చేసేవు అనాత్మ క్రియలు ఓ జీవా!
ఐదైదులును వాని క్రియలును
నీవు కాదు కదా ఓ జీవా!
బుద్ధిహీనమై మాయల మారికి లోబడబోకే ఓ జీవా!
గురువే తత్తు శిష్యుడె త్వమ్ము
అసి పద మెరుగవె ఓ జీవా!
గురు సాక్షాత్ పరబ్రహ్మము
విశ్వసించవె ఓ జీవా!
గురువే శిష్యుడు శిష్యుడు గురువే
గుర్తొక్కటే కదా ఓ జీవా!
అహంభావ రహితమే అద్వైత సిద్ధి కదా ఓ జీవా!Erstellen Sie Ihre eigene KI-Musik
Generieren Sie Songs in Studioqualität in Sekunden
Jetzt starten